శోభిత ధూళిపాళ నాగచైతన్యకు ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య కి ముందు సమంత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయినా కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు ఈ ఇద్దరూ. ఆ తరువాత నాగచైతన్య శోభిత ధూళిపాళ ఇద్దరూ వివాహం చేసుకోవటానికి సిద్ధపడ్డారు. ఇక వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. శోభిత ధూళిపాళ, రాజీవ్ సిద్ధార్థ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'లవ్ సితార' వందన్ కటారియా దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ 2020లోనే స్టార్ట్ అయ్యింది.

అయితే..అప్పుడు కరోనా తో సహా పలు కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ కు నోచుకోలేదు. ఇప్పుడు థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటిటి సంస్థ జి5 ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని జి 5 సమస్త అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. "లవ్, హార్ట్ బ్రేక్, సెల్ఫ్ డిస్కవరికి సంబంధించిన కథ ఇది. సెప్టెంబర్ 27 న లవ్ సితార జి 5లో ప్రిమియర్ అవుతుంది" అని ప్రకటించింది. అయితే..

ప్రస్తుతానికైతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ చెయ్యలేదు. కానీ త్వరలోనే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు మేకర్స్. కాగా ఈ చిత్రంలో శంకర్ ఇంద్రఛూడర్, రిజుల్ రే, సీమా సాన్వీ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జి5 లో త్వరలోనే రాబోతుంది. ఇక శోభిత కూడా ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది. ఇక ఆ సినిమా తర్వాత ఏ సినిమాలోను నటించలేదు ఈ ముద్దుగుమ్మ. నాగచైతన్యను వివాహం చేసుకోవటానికి సిద్ధపడింది. శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇవి పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: