ఒక సినిమాను ఎంత బాగా తీసాము అనేది ముఖ్యం కాదు. ఆ సినిమాను ఎంత బాగా పబ్లిసిటీ చేశాము అనేదే ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యం. ఎందుకు అంటే సినిమాను ఎంత బాగా తీసిన ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాను చూడాలి అనే ఉత్సాహాన్ని ప్రేక్షకుల్లో రేకెత్తించకపోతే మంచి సినిమా వచ్చిన కూడా థియేటర్లలో విడుదల అయి అంతా అయిపోయిన తర్వాత ఆ సినిమాకు మంచి టాక్ వస్తుంది. దాని ద్వారా సినిమాకు పెద్దగా లాభాలు ఏమీ ఉండవు. అదే సినిమా విడుదలకు ముందు కరెక్ట్ గా ప్లాన్ చేసి పబ్లిసిటీ బాగా చేసినట్లు అయితే థియేటర్లలోనే సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "దేవర" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్సినిమా ప్రచారాలను హిందీ లో చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే చాలా మంది ఈ సినిమాలో జాన్వి కపూర్ , సైఫ్ అలీ ఖాన్ నటించారు. వీళ్లిద్దరూ హిందీ వాళ్లే కావడంతో వారు అక్కడి పబ్లిసిటీ చూసుకోవడం చాలా మంచిది. ఇక తెలుగు లో ఎలాగో పబ్లిసిటీ చేయకపోయినా ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి తెలుగు లో పబ్లిసిటీ అవసరం లేదు. మిగతా భాషలలో పబ్లిసిటీ చేయడానికి ఎన్టీఆర్ సమయాన్ని కేటాయించి పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది అని అనవసరంగా హిందీ లో పబ్లిసిటీ చేయడం వల్ల టైమ్ వేస్ట్ అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: