యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరిగా నటించిన 4 సినిమాలకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 74.11 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 26.64 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జై లవకుశ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 21.81 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించాడు.

జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సమంత , నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 20.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: