70 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ తన ఉనికిని ఇప్పటికీ తెలుగు చిత్ర సీమలో చాటుకుంటున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. చిరు ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ సమయంలో ఓ పాల ఉత్పత్తుల కంపెనీ భారీ పారితోషికం ముట్టజెప్పి తమ వాణిజ్య ప్రకటనలో నటించాలంటూ చిరంజీవిని బతిమిలాడగా ఆయన దానికి అంగీకరించారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన ఈ యాడ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం అందరికీ తెలిసిందే. ఈ వాణిజ్య ప్రకటనలో చిరంజీవిగా, ఆత్మారావుగా ద్విపాత్రాభినయం చేయడం మీరు చూసే ఉంటారు.

ఇక ఈ ప్రకటనలో చిరంజీవితోపాటు కమెడియన్ సత్య కూడా నటించారు. ఓ వైపు ఈ ప్రకటనలో చిరంజీవి నటనకు అందరూ ఫిదా కాగా మరోవైపు సోషల్ మీడియా ఈ యాడ్ కు కులం రంగు పులిమింది. దీనిపైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది తాము ఇకనుంచి కంట్రీ డిలైట్ పాలు వాడమంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఇదంతా కులానికి సంబంధించిన యుద్ధమని అభిప్రాయపడుతున్నారు. అందుకే చిరంజీవి ఈ యాడ్ చేయడంవల్లే ఇకనుంచి కంట్రీ డిలైట్ పాలు వాడమంటూ బహిరంగంగానే కామెంట్స్ చేయడం ఇపుడు సదరు కంపెనీకి తలనొప్పిగా మారింది.

అందులో చెప్పుకోవడానికి పెద్ద విషయం ఏది లేనప్పటికీ చిల్లర అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి సామాజిక మాధ్యమాల్లో కంట్రీ డిలైట్ యాడ్ పై యుద్ధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక సెలబ్రిటీ ఒక ఉత్పత్తి గురించి చెప్పారంటే దాన్నిగురించి అన్నిరకాలుగా పరిశీలించి, నాణ్యత తెలుసుకొని మరీ యాడ్ చేస్తారని చిరంజీవి అభిమానులు కామెంట్లు చేస్తుంటే... మరో వర్గం, కులం రంగు పులుముకొని రాజకీయాలు చేయడంవల్ల నష్టపోయేది చిరంజీవి కాదని, ప్రజలే నష్టపోతారని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్ కు దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా ఇపుడు మరికొంతమంది విశ్లేషకులు సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధానికి దర్శకుడు, కంపెనీ, నటించిన హీరో ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: