విడాకుల తర్వాత కూడా సమంత తన ..మాజీ భర్త నాగచైతన్యతో పోటీపడి మరి సినిమాలు చేసింది. ముందుగా ఆమె యశోద లాంటి సినిమా చేసి మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అవడంతో పాటు సమంత పరువు పూర్తిగా తీసేసింది. విడాకుల తర్వాత సమంత ఓ అదిరిపోయే కమర్షియల్ సినిమా కోసం వెయిట్ చేస్తూ వస్తుంది.


అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు సమంతకు సరైన అవకాశం ఇవ్వట్లేదు. మధ్యలో విజయ్ దేవరకొండ తో ఆమె నటించిన ఖుషి సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. అయితే ఎట్టకేలకు సమంత తన మాజీ భర్త నాగచైతన్యకు సవాల్ విసిరే ఆఫర్ పట్టేసినట్టు తెలుస్తోంది. ఇంకా తనలో కమర్షియల్ హీరోయిన్ యాంగిల్ ఏమాత్రం తగ్గలేదని ఆమె ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలోని ఆమెకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించింది.


గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేదు. విజయకు ఇదే చివరి సినిమా అన్న ప్రచారం జరిగింది. ఈ సినిమా సరిగా ఆడక పోవడంతో విజయ్ మరో సినిమా చేస్తాడని అంటున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ 69వ సినిమా ఉంది. ఈ సినిమాలో సమంతను హీరోయిన్గా తీసుకున్నట్టు త‌మిళ సోష‌ల్ మీడియా లో ఒక న్యూస్ .. వైరల్ అవుతుంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.


కమర్షియల్ గా యాక్షన్ పరంగా ప్రేక్షకులు ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమా ఉంటుందని సమాచారం. గతంలో విజయ్ - సమంత కాంబినేషన్లో వచ్చిన తెరీ ( తెలుగులో పోలీసోడు ) సినిమా సూపర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: