ఏదైనా ఒక సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ , ఇండస్ట్రీ హిట్ ఆ స్థాయి విజయాలను అందుకున్నాయి అంటే అలాంటి తరహాలోనే సినిమాలను రూపొందించడానికి మేకర్స్ కసరత్తును మొదలు పెడుతూ ఉంటారు. అలాంటి విజయాలు ఏ స్థాయి హీరోలపై వర్కౌట్ అయ్యాయో అదే స్థాయి హీరోలను పెట్టి అలాంటి మూవీ ని రూపొందించి మళ్లీ అలాంటి విజయాలను అందుకోవాలి అని ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఇక అలాంటి ప్రయత్నాలలో కొన్ని సక్సెస్ అయినవి ఉన్నాయి. కొన్ని ఫెయిల్యూర్ అయినవి కూడా ఉన్నాయి.

కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలోని హీరో క్యారక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఈ మూవీ లోని మహేష్ క్యారెక్టరైజేషన్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే దాదాపుగా ఇలాంటి కథతోనే , ఇలాంటి క్యారెక్టరైజేషన్ తోనే మెహర్ రమేష్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కంత్రి అనే మూవీ ని రూపొందించాడు. ఇక విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విడుదల తర్వాత ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది.

ఆ తర్వాత ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్లను కూడా వసూలు చేయలేదు. ఓపరాలగా చూసుకుంటే ఈ సినిమా బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఎక్కువ శాతం పోకిరి సినిమా రిఫరెన్స్ వాడడం , హీరో క్యారక్టరైజేషన్ , కథ పోకిరి మూవీ కి చాలా దగ్గరగా ఉండడం ఈ సినిమాకు మైనస్ అయింది అనే నెగటివ్ టాక్ కూడా జనాల నుండి వచ్చింది. అలా పోకిరి మూవీ ని రీ క్రియేట్ చేద్దాము అనుకున్న మెహర్ రమేష్ కు ఈ మూవీ ద్వారా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: