కావలసినంత టాలెంట్ తో పాటు అందం ఉన్నా ... సరిపడా పర్సనాలిటీ ఉన్న లక్కు కలిసి రాని హీరోయిన్లలో రెజీనా కసాండ్రా ఒకరు. టాలీవుడ్లో ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. రెజీనా ఆ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రజెంట్, యాక్టింగ్ స్కిల్స్ అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసాయి. దీంతో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. కేఎస్ రవీంద్ర ( బాబి ) దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ప‌వ‌ర్‌ సినిమా ఆమెకు మంచి అవకాశం. ఆ సినిమాలో హన్సిక మెయిన్ హీరోయిన్ .. రెజీనా సెకండ్ హీరోయిన్ .. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమా రెజీనాను బిగ్ లిగ్‌ లోకి తీసుకువెళ్లాల్సి ఉన్నా కానీ అలా జరగలేదుపెద్ద అవకాశాలు రాలేదు.


సాయి ధరమ్ తేజ్‌తో పిల్లా నువ్వు లేని జీవితం , సుబ్ర‌హ్మ‌ణ్యం ఫర్ సేల్ సినిమాలు హిట్ అయినా కలిసి రాలేదు. ఆ తర్వాత స్థాయితోనే నక్షత్రం సినిమా కూడా చేసింది.  రెజీనా అంటే మిడిల్ రేంజ్ హీరోల పక్కన హీరోయిన్ అన్న టాక్ వచ్చేసింది. ఆ తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. చివరగా షాకిని ఢాకిని సినిమా చేసింది. అది ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో చాలా మందికి తెలియదు. అయితే రెజీనా మాత్రం తన యాక్టివ్గానే సినిమాలు చేస్తున్నానన్న ఫీలింగ్ లో ఉంది. తాజాగా ఆమె ఉత్సవం అనే సినిమా చేసింది.


సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన రెజీనాకి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు. అనే ప్రశ్న ఎదురైంది. ఊహించ‌ని ప్ర‌శ్న ఎదుర‌వ్వ‌డంతో ఆమె చిర్రుబుర్రు ఆడింది.. కోపం తెచ్చుకుంది. నేను అసలు గ్యాప్ తీసుకోవడం ఏంటి? నేను చేస్తున్న సినిమాలు గురించి కొంచెం తెలుసుకోండి .. అని రెజీనా మెత్తగా తన చిరాకును చూపించింది. నేను సినిమాలు చేయటం లేదని మీకు అనిపించిందంటే  ప్లానింగ్‌ లో లోపమని ఒప్పుకుంటాను.. ఈసారి ఆ తెలివి రాకుండా సినిమాలు చేస్తాను.. అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది. నిజానికి రెజీనా తెలుగులో కాకుండా మిగిలిన భాషలలో ఎక్కువగా వెబ్ కంటెంట్ చేస్తుంది. హిందీ, తమిళం భాషల్లో వరుస పెట్టి వెబ్ కంటెంట్లు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: