పాత సినిమాలు ఎవరు చూస్తారులే అనుకోవచ్చు కానీ ఆ మధ్య ఆ పాత సినిమాలే కొత్త సినిమాల కంటే ఎక్కువ వసూలు చేసాయి. పోకిరి నుంచి మొదలుపెడితే జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషీ, ఆరెంజ్, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాలు రీ రిలీజ్‌లోనూ మ్యాజిక్ చేసాయి. కానీ ఆ తర్వాత అదుర్స్, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలకు కనీస స్పందన కరువైంది.
రీ రిలీజ్‌ల టైమ్ అయిపోయింది.. ఇక ఎలాంటి సినిమాను విడుదల చేసినా చూడరులే అనుకున్నారంతా. కానీ తాజాగా వెంకీ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటై మైండ్ బ్లాక్ అయిపోతుంది.రవితేజ హీరోగా నటించిన వెంకీ సినిమా 2004లో విడుదలై సూపర్ హిట్ అయింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో కామెడీ అద్భుతంగా పండింది. టాలీవుడ్‍లో కామెడీ క్లాసిక్‍గా వెంకీ నిలిచిపోయింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా వెంకీ సినిమాను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇప్పటికీ వెంకీ మూవీ కామెడీ సీన్లను టీవీల్లో, ఆన్‍లైన్‍లో చూస్తూనే ఉంటారు. వెంకీ సినిమాలోని ట్రైన్ కామెడీ ఎపిసోడ్ చాలా మందికి ఫేవరెట్‍గా ఉంటుంది. రిలాక్స్ అయ్యేందుకు ఇప్పటికీ వెంకీ సినిమా చూస్తున్నామని కొందరు చెబుతుంటారు. అయితే, వెంకీ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో రీ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.
డేట్ కూడా ఫిక్స్ అయింది.

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ వెంకీ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. 2004 లో థియేటర్ల లో రిలీజైన ఈ చిత్రం గతేడాది చివర్లో మళ్ళీ విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం మరోసారి రీ-రిలీజ్ కి అయిపోయింది.ఈ సెప్టెంబర్ నెలలో 21 వ తేదీన మళ్ళీ థియేటర్లలోకి రాబోతుంది. ఇదే విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.20 ఏళ్ల క్రితం విడుదలైన వెంకీ సినిమా బ్లాక్‍బాస్టర్ అయింది. రవితేజ, స్నేహ హీరోహీరోయిన్లుగా అదరగొట్టారు. రవితేజ, బ్రహ్మానందం, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, రామచంద్ర మధ్య కామెడీ సీన్లు ఈ సినిమాకు ప్రధానమైన హైలైట్. ట్రైన్ కామెడీ సీక్వెన్స్‌లో వీరితో వేణుమాధవ్ జతకలుస్తాడు. ఈ మూవీకి ట్రైన్ ఎపిసోడ్ ప్రధానమైన బలంగా నిలిచింది. రవితేజ తండ్రి పాత్ర చేసిన తనికెళ్ల భరణి కూడా నవ్వులు పండించాడు. శ్రీనువైట్లను బిగ్ డైరెక్టర్‌ను చేసింది వెంకీ సినిమానే. శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీమోహన్ రాసిన డైలాగ్‍లు కూడా ఈ చిత్రంలో బాగా పేలాయి. ఇప్పటికీ వెంకీ సినిమా మీమ్‍లను సోషల్ మీడియాలో చాలా మంది వాడుతూనే ఉన్నారు. వెంకీ సినిమాతో సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్‍కు కూడా అప్పట్లో మంచి పేరు వచ్చింది. లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్ర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ భారీ లాభాలను ఆర్జించిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: