టాలీవుడ్ లో వచ్చే నాలుగు నెలలు నాలుగు పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోనున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 - బన్నీ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 , రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న గేమ్ ఛేంజర్. చిరంజీవి బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వంభ‌ర సినిమాలు వరుసగా నాలుగు నెలలు ఫిక్స్ అయ్యాయి. ఈ అన్ని సినిమాల థియేటర్ హక్కులు భారీగా చెబుతున్నారు.


ఇక త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా హక్కుల కంటే కూడా బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప‌ పార్ట్ 2 సినిమా థియేటర్ రైట్స్ ఎక్కువ రేటుకు అమ్ముడుపోతున్నాయి. దేవర సినిమా ఆంధ్రప్రదేశ్ రైట్స్ సీడెడ్‌ కాకుండా మిగిలిన ప్రాంతాలు అన్నింటికీ కలిపి రు. 55 కోట్లు చెబుతున్నారు. 55 కోట్ల షేర్ రావాలి .అంటే సినిమా అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ఇక ఇదే ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సీడెడ్ మినహాయించి మిగిలిన ఏరియాలకు పుష్ప 2 రైట్స్ ఏకంగా రు. 90 కోట్లు చెబుతున్నారు.


అంటే సీడెడ్ వదిలేసి ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణ, నెల్లూరు వరకు రు. 90 కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది.. అంటే క‌ల్కి మాదిరిగా భారీగా టికెట్ రేట్లు పెంచితే  తప్ప ఈ వ‌సూళ్లు సాధ్యం కాదు. ఈ సినిమా నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. పైగా ఈ సినిమా నిర్మాణంలో సదరు మంత్రి పెట్టుబడులు కూడా ఉన్నాయన్న ప్రచారం ఉంది. అందుకే నిర్మాతలు టికెట్ రేట్లు ఎలాగైనా పెంచుకుంటామన్న ధీమా తో ఈ రేంజ్ లో రేటు చెబుతున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా దేవరకంటే పుష్ప 2 ఎక్కువ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: