సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే మహేష్ బాబు తన సినిమా విడుదలకు ముందు అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను చాలా బాగా జనాల్లోకి తీసుకు వెళుతూ ఉంటాడు. ఇక సినిమా విడుదల అయిన తర్వాత ఆ సినిమాకు మంచి టాక్ గనుక వచ్చినట్లయితే మరింతగా జనాలను సినిమా ధియేటర్లకు రప్పించేందుకు తనవంతు ప్రయత్నాలను ఎన్నో చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇప్పటి వరకు మహేష్ బాబు తన సినిమాల విడుదలకు ముందు , విడుదల తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా విజయాలలో కీలక పాత్రను పోషించిన సందర్భాలు ఉన్నాయి.

ఇకపోతే కొన్ని సంవత్సరాలు క్రితం మహేష్ బాబు , కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా సమయంలో మహేష్ బాబు పాత్రికేయులతో ముచ్చటించాడు. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... భరత్ అనే నేను సినిమా సమయంలో మహేష్ బాబు తెలంగాణ లో అత్యంత కీలక రాజకీయ నాయకులలో ఒకరు అయినటువంటి కేటీఆర్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా మహేష్ బాబు కేటీఆర్ గురించి మాట్లాడుతూ ... కేటీఆర్ గారు సినిమా బాగుంటే బాగుంది అంటారు... లేకుంటే లేదు అని అంటారు. అనవసరంగా పొగడరు.

కొంత కాలం క్రితం నేను ఆగడు అనే సినిమాలో హీరోగా నటించాను. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక కేటీఆర్ కూడా ఆ సినిమా విషయంలో ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అసలు బాగోలేదు అని అన్నాడు. అలా కేటీఆర్ గారు సినిమా బాగోలేదు అంటే బాగోలేదు అని కచ్చితంగా చెబుతూ ఉంటారు. ఇక ఆగడు సినిమా విషయంలో ఆయన నాకు పెద్ద క్లాస్ తీసుకున్నారు అని మహేష్ బాబు "భరత్ అనే నేను" సినిమా సమయంలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: