కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవలే తంగలాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. పార్వతి తిరువత్తు, మాళవిక మోహన్ తదితరనటి నటులు ఇందులో నటించారు. ఈ చిత్రం 1950లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించడం జరిగింది.. ముఖ్యంగా అట్టడుగు వర్గాల ఉన్న గిరిజనులను ఉపయోగించి బ్రిటిష్ వారు బంగారాన్ని ఎలా రోజుకు వెళ్లారు అనే కథాంశంతో  తెరకెక్కించారు. ఇందులో ప్రతి ఒక్కరి నటన పై ప్రశంసలు కూడా వినిపించాయి.


స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే నిర్మించారు. ఆగస్టు 15న థియేటర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తంగలాన్ చిత్రం ఓటీటీ లో ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సందర్భంగా డిజిటల్ స్ట్రిమ్మింగ్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తంగలాన్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటి సమస్త నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది ఈ సినిమాని సెప్టెంబర్ 20వ తేదీన అన్ని భాషలలో ఒకేసారి స్ట్రిమ్మింగ్ తీసుకువచ్చేలా చేస్తున్నట్లు ఒక పోస్టర్ వైరల్ గా మారుతున్నది.


అయితే ఈ విషయాన్ని ఇంకా నెట్ ఫ్లిక్స్ సమస్త అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు అయితే అభిమానులైతే ఈ విషయం మీద అయోమయంలో పడ్డట్టుగా తెలుస్తోంది. హిందీలో సెప్టెంబర్ 27న స్ట్రిమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..తంగలాన్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్నది. మరి ఓటీటీలో ఒకవేళ వస్తే ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ముఖ్యంగా విక్రమ్ మరొకసారి తన అద్భుతమైన నటనత ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈయన నటనకు ఫిదా అయ్యారు అనే విధంగా కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: