విషయం ఏమిటంటే, ఆ ఘటన తర్వాత స్టేజ్ పైకి వచ్చిన రానా.. మొదట షారుక్ ను హగ్ చేసుకుంటూ.. తాను పూర్తిగా సౌత్ ఇండియన్ అని.. కాళ్లు తాము ఇలా మొక్కుతామంటూ షారుక్, కరణ్ జోహార్ కాళ్లు మొక్కాడు. దాంతో రానా చేసిన పనికి షారుక్.. ఆశ్చర్యపోతూ అతన్ని నవ్వుతూ హగ్ చేసుకొని, మేము కూడా సౌత్ ఇండియన్స్. కాదని ఇక్కడ ఉన్నవారిలో ఎవరంటారు? అని అందంతో అక్కడున్న ఆడియెన్స్ అందరూ పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో ఆడిటోరియంని మారుమోగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను అక్కడున్న ఓ ఫొటోగ్రాఫర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి.
దీనిపై ఫ్యాన్స్ చాలా మంది ఈ విధంగా రియాక్ట్ కావడం మనం ఇక్కడ గమనించవచ్చు. "సౌత్ ఇండియన్స్ సంస్కృతి అద్భుతంగా బాగుంటుంది" అని కొంతమంది అంటుంటే "ఈ దృశ్యం కన్నుల పండుగగా ఉంది" అంటూ మరికొందరు స్పందించారు. "షారుక్ అంటే చాలామంది ఇష్టపడతారని, తాజాగా రానా ఇలా చేయడం అందుకు నిదర్శనం" అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఐఫా అవార్డుల కార్యక్రమం త్వరలో అబుధాబిలో జరగనుంది. ఇందులో షారుక్ ఖాన్ తోపాటు కరణ్ జోహార్, రానా, సిద్దాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ లాంటి వాళ్లు హోస్ట్ చేయనున్నారు. ఇక సీనియర్ నటి రేఖతోపాటు షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, కృతి సనన్ లాంటి వాళ్లు పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఐఫా 2024 సెర్మనీ సెప్టెంబర్ 27, 29 తేదీల్లో అబు ధాబిలోని యాస్ ఐలాండ్ లో జరగనుంది.