కాజల్ అగర్వాల్ గురించి తెలుగు జనాలకు వేరే చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన చందమామ కాజల్ అంటే ఇప్పటికీ జనాల్లో అంతే క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. సౌత్ లో తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఆమె టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే కొన్నాళ్లుగా వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పెళ్లి, బిడ్డ తర్వాత మళ్లీ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకి సెకండ్ ఇన్నింగ్ కూడా బాగా రాణిస్తుందనే చెప్పుకోవాలి. భగవంత్ కేసరిలో హీరోయిన్ పాత్రలో మెప్పించింది కాజల్. ప్రస్తుతం కాజల్ బాలీవుడ్లో ఉమా అనే మూవీ కూడా చేస్తోంది. తమిళ్ లో అయితే భారతీయుడు 3 చాలా వరకూ కంప్లీట్ అయింది.

ఈ సమయంలోనే కొన్ని ప్లాఫ్ సినిమాలు ఆమెని ఇబ్బంది పెడుతుననట్టు కనబడుతోంది. కన్నప్పలో ఓ గెస్ట్ రోల్ చేసింది. ఈ టైమ్ లో తనకు మరో భారీ ఆఫర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె సెకండ్ హీరోయిన్ స్థానానికి కూడా సై అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించడానికి సిద్ధపడింది వినికిడి. సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ్ డైరెక్టర్ మురుగదాస్ సింకిందర్ అనే మూవీ చేస్తున్న సంగతి విదితమే. టాప్ నాచ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాని సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ను తీసుకోబోతున్నారని బి టౌన్లో టాక్ నడుస్తోంది.

ఇకపోతే కాజల్ గతంలో మురుగదాస్ డైరెక్షన్లో రూపొందిన తుపాకీ మూవీలో నటించిన సంగతి తెలిసినదే. అప్పటి నుంచి వీరి మధ్య మంచి సంబంధం ఏర్పడింది. ఆ కారణంగానే తను సికిందర్ లోకి సెకండ్ హీరోయిన్ స్థానంలో ఎంట్రీ ఇస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రావాల్సి ఉంది. కాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చూసిన కాజల్ అభిమానుల గుండె చివుక్కుమంటోంది. మా చందమామకు ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? అంటూ నిట్టూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: