క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నోరు విప్పిన వారిలో సింగర్ చిన్మయి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈమె తన జీవితంలో జరిగిన సంఘటనలు ఎలాంటి భయం లేకుండా బయటపెట్టింది. అంతేకాదు అందరూ కూడా తనలాగే ఏ విషయమైనా బయట పెట్టాలని చెబుతుంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఆడవారికి ఏదైనా జరిగితే అస్సలు ఊరుకోదు. తన వెర్షన్ లో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో హైలెట్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ గతంలో చేసిన కామెంట్లు మళ్ళీ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ప్రస్తుతం కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తున్న వేళ చిన్మయి గతంలో ఓ సింగర్ గురించి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే..  ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్లు,హీరోలు మాత్రమే కాదు సింగర్ కావాలనుకునే వాళ్లకు కూడా ఇలాంటి అనుభవాలు తప్పవు. 

ఇండస్ట్రీలో మంచి పేరున్న స్టార్ సింగర్ కార్తీక్ అంటే తెలియని వారు ఉండరు. అయితే ఈయన పై అప్పట్లో చిన్మయి షాకింగ్ కామెంట్లు చేసింది. సింగర్ కార్తీక్ వల్ల ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి.. ఆయన అమ్మాయిలకు ఫొటోస్ పంపి లాంగ్ డ్రైవ్ కి వెళ్దామా.. డేట్ చేద్దామా అని అడిగి వారిని టార్చర్ చేస్తాడు.ఈయన చెన్నై, స్విట్జర్లాండ్, హైదరాబాదులో ఉండే అమ్మాయిలను కూడా వాడుకున్నారు. అయితే సింగర్ గా కార్తిక్ అంటే నాకు గౌరవమే. కానీ ఒక మంచి హోదాలో ఉన్న ఈయన అలాంటి పనులు చేయడం నేను ఒప్పుకోలేక పోయాను. అయితే ఈ విషయం నేను బయట పెట్టాక సింగర్ మనో గారు నాకు ఫోన్ చేసి నీతో పాటు వచ్చిన వారిలో ఆయన కూడా ఒకరు.

ఎందుకు ఆయన జీవితం నాశనం చేస్తున్నావు.ఆ మాటలు వెనక్కి తీసుకో అని చెప్పారు. కానీ ఈ విషయంలో నేను నా మాటలు వెనక్కి తీసుకోవాలి అనుకోలేదు. అలాగే మనో గారు కార్తీక్ కి ఎందుకు సపోర్ట్ చేశారో కూడా అర్థం కాలేదు. ఇక కార్తీక్ గురించి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సరిగమప షోలో మేమిద్దరం జడ్జిలుగా పక్కపక్కనే కూర్చున్నాం. కానీ ఆ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అంటూ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే అప్పుడు చిన్మయి మాట్లాడిన ఆ వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: