యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. మొత్తం ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సినిమాలో కంటెంట్ ఉండి ఏ మాత్రం బోరు కొట్టకుండా సినిమా సాగితే ఈ రన్ టైమ్ పెద్ద విషయం ఏమీ కాదు. కానీ సినిమా ఎక్కడైనా కాస్త గ్రిప్ తప్పిన కూడా ఈ రన్ టైమ్ అనేది సినిమాకు నెగిటివ్ గా మారే అవకాశం ఉంది. మరి భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్న దేవర మొదటి భాగం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో , బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: