బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కరీనాకపూర్ ఇప్పటికీ కూడా ఎన్నో చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతోంది. మూడు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. బుల్లితెరపై కూడ అదరగొట్టేసింది. వెండితెర పైన అందరి హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో రకాల లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క హాలీవుడ్ సినిమాలో కూడా నటించలేదు. కరీనా కంటే ఆ తర్వాత వచ్చిన దీపికా పదుకొనే, ఆలియాభట్ తదితర హీరోయిన్స్ కూడా హాలీవుడ్లో నటించడం జరిగింది.


అలాగే తన తోటి హీరోయిన్స్ ఆయన ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా వంటి వారు కూడా హాలీవుడ్లో నటించారు. తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో  పాల్గొన్న కరీనాకపూర్ అక్కడ యాంకర్ హాలీవుడ్ కి వెళ్లే ఆలోచన ఏమీ లేదా అని అడగగా.. అందుకు కరీనా తాను నటిగా ఎంతో సంతోషంగా ఉన్నాను అన్ని రకాల పాత్రలలో చాలా ఆనందంగా నటించాను.. తన నటించిన ప్రతి పాత్ర కూడా తనకు సంతృప్తిని ఇచ్చిందని ఫలానా భాషలో పలానా పాత్ర చేయాలని ఆలోచన తనకి లేదని తెలిపింది.


తాను లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి విషయాన్ని కూడా సాధించాను అంటూ హాలీవుడ్ పరిశ్రమ పైన తనకి పెద్దగా ఆశలు లేవంటూ తెలిపింది. తాజాగా బజార్  మ్యాగ్జిన్ పేపర్ పైన కరీనాకపూర్ 43 ఏళ్ల వయసులో కూడా తన అంత చెందాలని చూపిస్తూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా తన ఎద అందాలు అందాలను చూపిస్తూ కుర్ర హీరోయిన్లకు దీటుగా తాను కూడా గ్లామర్ వలకబోస్తా అనే హింట్ కూడా ఇస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ వయసులో కూడా అదే అందాన్ని ఫిజిక్కిని మెయింటైన్ చేస్తూ కరీనాకపూర్ ఫోజులు ఇచ్చిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: