గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తున్న హీరో ఎన్టీఆర్. వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా, జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదివరకే విడుదలైన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లో సినిమా ప్రారంభంలో ప్రకాష్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇస్తూ కులం లేదు, మతం లేదు, భయం లేదు అంటూ ఓ డైలాగు చెబుతాడు. అయితే ఈ డైలాగ్ వైసీపీ అధినేత జగన్ నుంచి తీసుకున్నారనే మాటలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో జగన్ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అంటూ చెప్పారు. ఇప్పుడు ఆ డైలాగ్ ని దేవర సినిమాలో వాడినట్టుగా తెలుస్తోంది.


గతంలో కూడా ఎన్టీఆర్ స్టేజి మీద జగన్ చెప్పిన ఓ డైలాగు ను చెప్పడం జరిగింది. దేవర సినిమా లేట్ అయినప్పటికీ అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని తెలియజేశాడు. దీంతో ఎన్టీఆర్ కావాలని చెబుతున్నారో లేదా యాదృచ్ఛికంగా చెప్పారా అనేది తెలియదు కానీ కొంతమంది నెటిజెన్లు మాత్రం మాజీ సీఎం జగన్ ను బాగా వాడుతున్నారు కదా అని అంటున్నారు.

కాగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, నరైన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. దేవర సినిమా పార్ట్ వన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దర్శకుడు కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: