అయితే కొరటాల ఈమూవీ కథను వీలైనంత తక్కువ రివీల్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ ట్రైలర్ ను ఇలా కట్ చేసి ఉంటాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ ట్రైలర్ కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఒక్కరోజు పూర్తి కాకుండానే ఈమూవీ ట్రైలర్ కు పాతిక మిలియన్ వ్యూస్ రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
ఇదిలా ఉండగా కొందరు వ్యక్తులు వర్గాలు కావాలని కొరటాల శివను టార్గెట్ గా చేసుకుని ఇలా ఈమూవీ ట్రైలర్ కు నెగిటివ్ స్పందన వచ్చే విధంగా వ్యూహాత్మకంగ వ్యవహరించడంతో ఈ ట్రైలర్ కు ఇలాంటి మిశ్రమ స్పందన వచ్చి ఉంటుందని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇంకొందరైతే ఈ నెలఖరున విడుదల కాబోతున్న ‘దేవర’ మూవీలో ‘ఆచార్య’ ఛాయలు ఉంటాయి అంటూ మరికొందరు ఈమూవీ ట్రైలర్ ను టార్గెట్ చేసినప్పటికీ ఈ ట్రైలర్ కు వచ్చిన స్పందన బట్టి ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ రావడం అన్న సంకేతాలు వస్తున్నాయి.
‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత తారక్ నటించిన మూవీ ‘దేవర’ కావడంతో అభిమానులలో ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఒక బ్లాక్ బష్టర్ హిట్ కొట్టిన హీరోకు ఆతరువాత వెనువెంటనే వచ్చిన సినిమా హిట్ అయిన సందర్భాలు లేవు అన్న సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ ను ‘దేవర’ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి..