నామినేషన్స్ సమయంలో కూడా విష్ణు ప్రియాపై సోనియా చాలానే కామెంట్స్ చేయడం మనం గమనించవచ్చు. అడల్ట్రీ జోక్స్ వేస్తుంది అంటూ ఆమెను తప్పుబట్టింది. దాంతో విష్ణు ప్రియా, నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు చెప్పు? అని అడిగ్గా.. ఇంట్లో అందరూ ఇబ్బంది పడ్డారు! అంటూ సోనియా ఆమెతో వాగ్వాదం పెట్టుకుంది. దానికి సోనియా వివరణ ఇస్తూ... “విష్ణుప్రియా రూమ్ లో బట్టలు మార్చుకుంటున్న టైంలో ఆదిత్య ఓం ఆమె రూమ్‌లో ఉందని తెలియక ఆ రూమ్ లోకి వెళ్లారు.. ఆ తర్వాత ఆయన వణుకుతూ బయటకు రావడం జరిగింది. ఆ టైంలో విష్ణు జస్ట్ బ్లౌజ్‌లో ఉంది.. ఆతర్వాత బయటకు వచ్చిన విష్ణు ప్రియా ఆదిత్య దగ్గరకు వచ్చి మిమ్మల్నిఆన్ కంఫర్ట్బుల్ గా ఫీల్ చేశాను సారీ! అని చెప్పింది.. అయినా రూములో ఒంటరిగా బట్టలు వేసుకుంటున్నపుడు, కాస్త ముందు వెనకా చూసుకోవాలి కదా?’’ అని సోనియా చెప్పుకొచ్చింది.
ఇక్కడే మొదలైంది అసలు రెచ్చి. అందులో సోనియా విష్ణుప్రియ తప్పు లేకపోయినా దుయ్య బట్టడం మిగతా వారికి అంతగా నచ్చలేదు. ఈ విషయంలో సోనియా ఆటిట్యూడ్ మిగిలినవారికి చాలా చిత్రంగా అనిపించింది. నిజానికి విష్ణు హౌస్ లో బాగానే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలోలా అందాలు ఆరబోయకుండా.. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కూడా. ఈ తరుణంలో సోనియా తన ఆట తాను ఆడకుండా.. విష్ణు ప్రియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది.