టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాని ప్రస్తుతం వరుస విజయాలతో దుసుకుపోతున్నాడు. పోయిన సంవత్సరం దసరా , హయ్ నాన్న సినిమాలతో మంచి విజయాలను అందుకున్న నాని ఈ సంవత్సరం సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 29 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబందించిన 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల్లో ఈ సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 13.76 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.58 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.67 కోట్లు , ఈస్ట్ లో 1.94 కోట్లు , వెస్ట్ లో 1.37 కోట్లు , గుంటూరులో 1.79 కోట్లు , కృష్ణ లో 1.78 కోట్లు , నెల్లూరు లో 1.19 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 13 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 29.08 కోట్ల షేర్ , 48.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 13 రోజుల్లో కర్ణాటక , తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 6.88 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 11.95 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 13 రోజులకు గాను ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 47.91 కోట్ల షేర్ , 88.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మన్ కంప్లీట్ చేసుకుని 5.91 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: