తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటీమణులలో సంయుక్తా మీనన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈమె రానా కు భార్య పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగులో మంచి క్రేజ్ , ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే ఈమె చాలా సినిమాలలో హీరోయిన్గా నటించింది.

ఆఖరుగా ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన డేవిల్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. నిన్న ఈమె పుట్టిన రోజు కావడంతో ఈమె నటిస్తున్న కొన్ని సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా విడుదల అయ్యాయి. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో శర్వానంద్ కు జోడిగా కనిపించబోతుంది.

అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు మూవీ లతో పాటు ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూడు మూవీ బృందాలు కూడా నిన్న సంయుక్తా మీనన్ పుట్టిన రోజు కావడంతో ఆ సినిమాల నుండి ఈమెకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశాయి. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ మూవీలలో ఒకటి లేదా రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నట్లయితే ఈ నటి క్రేజ్ తెలుగులో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: