టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తన తోటి నటులు ఎంతో మంది రీమిక్ సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న కూడా మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు తన కెరియర్లో ఒక్క రీమిక్ సినిమాలో కూడా నటించలేదు. అలాగే అనేక సార్లు రీమిక్ సినిమాలో నటించను అని కూడా మహేష్ బాబు చెప్పేశాడు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు హీరోగా సమంత హీరోయిన్గా చాలా సినిమాలు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే.

వీరి కాంబోలో ఇప్పటి వరకు దూకుడు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , బ్రహ్మోత్సవం అనే మూడు మూవీ లు వచ్చాయి. ఇక పోతే కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు ను సమంత ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా సమంత మీకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన సినిమా ఏది అని మహేష్ బాబు ను అడిగింది. దానికి మహేష్ జవాబు ఇస్తూ ... నాకు ఈ మధ్య కాలంలో తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన కత్తి సినిమా బాగా నచ్చింది. ఆ సినిమా అద్భుతంగా ఉంది అని మహేష్ సమాధానం ఇచ్చాడు. దానికి సమంత స్పందిస్తూ ... అంత బాగా నచ్చిందా ..? ఆ సినిమా అయితే దానిని రీమిక్ చేయండి అని సమంత అడిగింది.

దానితో మహేష్ నాకు సినిమా నచ్చింది అన్నాను. కానీ రీమేక్ చేస్తాను అనలేదు. నాకు రీమిక్ సినిమాలు చేయడం నచ్చదు. దానికి ప్రధాన కారణం మనం రీమిక్ సినిమా చేస్తే ఎంత బాగా చేసిన ఆ రీమేక్ సినిమాలే జనాలకు నచ్చుతాయి. మనం చేసే నటన కూడా మనకు అంతగా నచ్చదు. అందుకే నేను రీమిక్ సినిమాలు చెయ్యను అని సమంత కు సమాధానం ఇచ్చాడు. ఇకపోతే విజయ్ హీరోగా రూపొందిన కత్తి సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: