అయితే ఐశ్వర్య రాయ్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలియజేసింది. తన కూతురు అధ్యా అంటే తనకు చాలా ఇష్టమని తెలియజేసింది. ఐశ్వర్యారాయ్ తనకు 18 ఏళ్ల వయసు నుంచి చాలా బాధ్యతలను మోసాను తాను ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేచే దాన్ని.. తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్ననే తెలియజేసింది. అయితే తన కూతురు అధ్యా జన్మించిన తరువాత ఎక్కువగా తనకే ప్రాధాన్యత ఇస్తూ ఉండాలంటూ తెలిపింది అప్పటినుంచి తన జీవితమే పూర్తిగా మారిపోయిందని తెలిపింది ఐశ్వర్యరాయ్.
తనకు తన కూతురు ఆధ్యనే ముఖ్యమని తన కూతురు ఎప్పుడూ కూడా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటుందని తెలిపింది.. ఎక్కువగా తన తండ్రి పాటలు తన తాత పాటలు పాడుతూ ఉంటుందని తెలియజేసింది ఆరాధ్య కూడా తన జీవితాన్ని సాధారణంగా గడపాలని ఎక్కువగా చూస్తూ ఉంటుంది.. తన కూతురు కన్నా మరెవరు తనకి ముఖ్యం కాదని కూడా తెలిపింది. తన కూతురికి ఏది అవసరమో అదే చేయాలనే విషయంపైనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను బిజీ షెడ్యూల్ వల్ల అలా చేయలేకపోతే తనకు సపోర్టుగా ఉన్న తన భర్త చేస్తూ ఉంటారని.. ఈ విషయంలో తాను అదృష్టవంతురాలని అంటూ ఐశ్వర్యారాయ్ వెల్లడించింది. మరి ఈ విషయాలతో విడాకులు రూమర్స్ కి చేక్ పడుతుందేమో చూడాలి.