బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లైవ్ ని చూడాలని అందరూ ఆశపడతారు. కానీ అందరికీ కుదరక పోవచ్చు. అందుకే మీలాంటి వారికోసమే ఈ అప్డేట్స్ తెలియజేస్తున్నాం.

బిగ్ బాస్ హౌస్ లో డిష్ లు క్లీన్ చేసే విషయంపై లగ్జరీ టీం చేయాలా? వద్దా అన్న విషయం పైన విష్ణు ప్రియ వివరణ అడుగుతుంది. ప్లీజ్ బిగ్ బాస్ ఏదో ఒకటి చెప్పండి? అంటూ కిచెన్ లో అభయ్, సీత ఉన్నప్పుడు తాజాగా మాట్లాడిన విజువల్స్ మనం చూడవచ్చు. అదేవిధంగా ఫిజికల్లి ఫిట్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అని నబీల్ తో మణికంఠ కాసేపు క్లాస్ తీసుకున్నాడు. పృధ్వి కోపం గురించి కిచెన్ దగ్గర సీత, విష్ణు ప్రియ ముచ్చట పెడుతున్నారు. సోఫా నైనిక, నిఖిల్ అయితే వాళ్ల ముద్దుపేర్ల గురించి అరగంట దాకా ముచ్చట పెట్టారు.

నిన్న రాత్రి నిద్ర డిస్ట్రబ్ చేసినందుకు యష్మి చాలా ఫీలయ్యానని ప్రేరణతో చెప్పింది. కిచెన్లో అయితే విష్ణు ప్రియ, అభయ్ టీ వండుతున్నారు. అదే సమయంలో ఆదిత్య ఓం వచ్చి ఫ్రిజ్ డోర్ మీరు వేస్తారా? లేదా నేను వేయాలా? అని జోక్ చేశాడు. ప్రేరణలో బెడ్ రూమ్ లోకి వచ్చి తను వేసుకున్న షర్ట్ గురించి అభయ్, శేఖర్ బాషా, ఆదిత్య ఓం లతో చెబుతుంది. సోనియా, నిఖిల్, కిరాక్ సీత, విష్ణు ప్రియ, నైనిక, మణికంఠ ఒకచోట గుమిగూడి గూడుపుఠాణి నెరుపుతున్నట్టు కనబడుతోంది. హౌస్ బయట అయితే చెయిర్స్ లో అభయ్, పృధ్వి, నిఖిల్, నబీల్, ఆదిత్య ఓం కూర్చుని ఆ తాడు ఆట గురించి మాట్లాడుతున్నారు.

ఆ తరువాత నిఖిల్, ఆదిత్య ఓం, కిరాక్ సీత, అభయ్, నబీల్, యష్మి, శేఖర్ బాషా, ప్రేరణ, పృధ్వి డాన్స్ చేస్తున్నారు. సాంగ్ పూర్తి కాగానే అందరు కంటెస్టెంట్స్ గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని చెప్పారు. ఇక ఉదయం 10:30 సమయానికి బిగ్ బాస్ ప్లీజ్ టాస్క్ ఆడి మీ ప్రైజ్ మనీ పెంచుకోండి? అని చెప్పగా బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ను 3 క్లాన్ సభ్యులు వినియోగించుకోవాలని పోటీపడుతున్నారు. రెండు టాస్కులు పూర్తి కాగా 3 వ టాస్క్ 75 వేలా లేదా లక్ష రూపాయలకు ఇస్తారా అన్నది కంటెస్టెంట్స్ మధ్య చర్చ జరిగింది. ప్రస్తుతానికైతే ఇలా నడుస్తుంది... రాబోయే అప్డేట్స్ గురించి వేచి చూడండి!

మరింత సమాచారం తెలుసుకోండి: