ఇప్పటివరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ ఇండియన్ మూవీలు ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి సౌత్ ఇండియాలో అత్యధిక కలెక్షన్లను వసులు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 1290 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలోనూ , యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ 1233 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 1061.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. 

రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.0 సినిమా 709 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది . ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ 630.15 కోట్ల కనెక్షన్లతో ఆరవ స్థానంలో నిలిచింది. రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ మూవీ 606.30 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి మొదటి భాగం 605 కోట్ల కనెక్షన్లతో 8 వ స్థానంలో నిలిచింది. తళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో మూవీ 600.60 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలోనూ , మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం 487.50 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: