ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్న యువ నటీమణులలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఈచట వాహనంలో నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి కమర్షియల్ విజయం హిట్ ది సెకండ్ కేసు మూవీ తో లభించింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన గుంటూరు కారం సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించింది. 

తాజాగా ఈమె తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన ది గోట్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. సినిమాలలో వీలు చుక్కినప్పుడల్లా తన హాట్ అందాలను భారీ స్థాయిలో ఆరబోస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇది వరకు అనేక సార్లు ఈమె అనేక హాట్ ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈమెకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ వైట్ కలర్ డ్రెస్ ను వేసుకుంది.

అలాగే ఓ కోట్ ను తన భుజాలపై వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. మీనాక్షి కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ నటి విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc