బాహుబలి 1 - 2 సినిమాల దెబ్బకు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ప్రభాస్ దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్లు చేస్తూ దూసుకుపోతున్నాడు . గత ఏడాది కల్కి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు ఎన్ని కావాలంటే అన్ని కాల్ షీట్లు సర్దుబాటు చేస్తూ వచ్చాడు ప్రభాస్. అయితే ఇకపై అలా జరిగే అవకాశం లేదు  .. అయితే ఇప్పుడు దర్శకుడు మారుతికి మాత్రం ప్రభాస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు డెడ్ లైన్ కూడా పెట్టాడన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. వచ్చే నెలలోపు రాజాసాబ్‌ షూటింగ్ మొత్తం పూర్తి చేసేయాలని మా రుతికి చెప్పేసాడట. దీనికోసం కంటిన్యూగా నెలరోజులు కాల్ సీట్లు ఇచ్చేశాడు.


ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఓ కారణం ఉందని తెలుస్తోంది. త్వరలోనే హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. పిరియాడిక్ కథతో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ కాస్త డిఫరెంట్ లుక్ లో కనిపించాలి. అందుకే రాజాసాబ్‌ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 % పూర్తయినట్టు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి టాకీ అయిపోతుందని ... ఆ తర్వాత పాటలు షూటింగ్ పెట్టుకుంటామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. అందుకే నెలరోజుల కంటిన్యూగా కాల్ సీట్లు ఇస్తాను ఈ లోగా షూటింగ్ పూర్తి చేయకపోతే తానేం చేయలేను అని ప్రభాస్ మారుతికి కరాకండిగా కండిషన్లు పెట్టడంతో పాటు సుతి మెత్తగా చిన్నపాటి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు అన్న ప్రచారం అయితే టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: