అరవింద సమేత తర్వాత ఇప్పటివరకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు డ్యాన్సులు చూడలేదు అభిమానులు. త్రిబుల్ ఆర్‌ సినిమా ఎన్టీఆర్ నటన స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. అందులో ఎలాంటి సందేహం లేదు.. కానీ మాస్ ప్రేక్షకుల ఆకలి మిగిలే ఉంది. అరవింద సమేత వచ్చి కూడా ఐదేళ్లు దాటిపోయింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ ప్రేమికుల అందరి దృష్టి ఈ నెల 27న రిలీజ్ అవుతున్న దేవర సినిమా మీదే ఉంది. దేవర సినిమాలో ఎమోషన్ తో పాటు ఎన్టీఆర్ లవర్ బాయ్ గా కూడా కొంతవరకు కనిపిస్తాడని సమాచారం. జాన్వీకపూర్ తో రొమాంటిక్ కూడా వైరల్ అయింది. తాజాగా దేవర ట్రైలర్ వచ్చింది.. జనాలని బాధపెట్టే రౌడీలు వాళ్ళని కట్టడి చేసే నాయకుడు ఇది కాన్సెప్ట్ . దీనికి అదనపు ట్రాక్ ఏమిటంటే నాయకుడికి భయస్తుడైన కొడుకు అతగాడికి ఓ లవ్ ట్రాక్ ... ట్రైలర్ చూసిన తర్వాత మనకు ఇదే తెలుస్తోంది.


కథలో చాలా ట్విస్టులు ... టర్న్ లు ఉండనే ఉన్నాయి. హీరో పిరికివాడు ఎందుకు ? అవుతాడు .. పిరికివాడు పిరికివాడిగా ఉండిపోతే కథ‌ ఏముంటుంది ... అందుకే ట్రైలర్లో చెప్పని సంగతులు ట్విస్టులు చాలానే ఉంటాయని తెలుస్తోంది. ట్రైలర్ అయితే మరీ అద్భుతంగా ఏమి లేదు ... జస్ట్ ఒకే. ట్రైలర్ సముద్రం చుట్టూ సీన్లు ... ధైర్యం - భయం చుట్టూ డైలాగులు తిరిగాయి. ప్రస్తుతానికి ట్రైలర్ చూసిన విశ్లేషకులు అయితే సినిమా యావరేజ్ గా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. సినిమా యావరేజ్ గా ఉన్న ఎన్టీఆర్ నటనతో కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్షం కురిపిస్తుందని లెక్కలు వేస్తున్నారు. మరి ఎన్టీఆర్ దేవరక బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తాడు ? ఈనెల 27న తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: