ప్రతి శుక్రవారం కూడ ఎన్నో కొన్ని చిత్రాలు థియేటర్లో ఓటీటీలో విడుదలవుతూ ఉంటాయి. అలా ఈ రోజున చాలా చిత్రాలు విడుదలయ్యాయి. అప్పుడెప్పుడో మత్తు వదలరా సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా మత్తు వదలరా-2 సినిమా ఈరోజు థియేటర్లో వచ్చేసింది. అయితే హైదరాబాదులో నిన్నటి రోజున సాయంత్రమే స్పెషల్ ప్రీమియర్ షోలు పడ్డట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


మత్తు వదలరా సినిమాలో శ్రీ సింహ కోడూరి నటించారు, ఫరియా అబ్దుల్లా, సత్య ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచారట. ఈ సినిమాలో ముఖ్యంగా చిరంజీవిని హైలెట్ చేస్తూ తెరకెక్కించిన డైరెక్టర్ రితేష్ రాణా సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది.. ముఖ్యంగా మత్తు వదలరా-2 సినిమా ఇంటర్వెల్ క్లైమాక్స్ స్టార్టింగ్ ఇలా అన్నీ కూడా అదిరిపోయేలా రెస్పాన్స్  వస్తున్నాయి అంటూ పలువురు నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా హిలేరియాస్ కామెడీ వర్కౌట్ అయిందని ఈ సినిమాలో సత్యనే హైలెట్గా మారిపోయారని కామెంట్స్ చేస్తున్నారు.

మత్తు వదలరా-2 సినిమా మొత్తం సత్య కామెడీ తోనే వెర్రితనంతోనే నడిచిందని ఈ జనరేషన్ యాక్టర్ ఇలా నవ్వి నవ్వి పోతారంటూ తెలుపుతున్నారు.. మరొక నేటిజన్ ఈ రేంజ్ లో ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని తెలుపుతున్నారు. మరొ నేటిజన్ మత్తు వదలరా చిత్రంలో యాక్టర్ సత్యానే వన్ మ్యాన్ షో కామెడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రితేష్ రానా డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవిని ఈ సినిమాలో స్క్రీన్ మీద చూసినప్పుడు వచ్చే రీసౌండ్ అదిరిపోయేలా ఉందని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో చూసి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్లాలని చాలామంది ఫిక్స్ అయ్యారు అంటూ ఒక నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మత్తు వదలరా-2 సినిమా మంచి విజయాన్ని అందుకుందని చెబుతున్నారు. మరి పూర్తి రివ్యూ కావాలంటే మరొక కొన్ని గంటలు ఉండాల్సింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: