యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో హీరోగా నటించాడు. ఆఖరుగా జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించి భారీ కలెక్షన్లను వసూలు చేయడంతో ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కి ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇకపోతే ఎన్టీఆర్ తో కేవలం ఒకే ఒక సినిమాలో నటించిన జాన్వి తన గురించి అద్భుతమైన విషయాలను తాజాగా చెప్పుకొచ్చింది. తాజాగా జాన్వి , ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ... ఎన్టీఆర్ తో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక గొప్ప హార్డ్ వర్కర్. ఆయనతో పని చేసిన తర్వాత ఆయనకు ఫ్యాన్ అయిపోయాను.

దేవర మాత్రమే కాదు మరిన్ని సినిమాల్లో ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉంది అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా జాన్వి చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇప్పటివరకు దేవర సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: