సొట్ట బుగ్గల సుందరి తాప్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మాత్రం తన అందాలను ఓలకబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.

దానితో ఈ సినిమా యావరేజ్ అయిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి తెలుగులో అవకాశాలు దక్కాయి. తెలుగులో పర్వాలేదు అనే స్థాయిలో కెరీర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అక్కడ ఈమెకు మంచి అవకాశాలు దక్కడం , అలాగే ఈమె నటించిన సినిమాలు దాదాపు సక్సెస్ కావడంతో ఈమె క్రేజ్ అక్కడ బాగా పెరిగింది. ఇకపోతే తాప్సి కమర్షియల్ సినిమాలలో కాకుండా ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో తాపీ కి భారీ విజయాలు లేవు.

కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం ఈ నటి షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన డంకి అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ కోసం ఈ ముద్దుగుమ్మ ఏకంగా 11 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈమెకు పెద్ద స్థాయి విజయాలు లేకపోయిన రెమ్యూనరేషన్ మాత్రం పెద్ద మొత్తంలోనే తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: