కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో విజయ్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో తండ్రి పాత్ర చేసిన విజయ్ కి జోడిగా స్నేహ నటించింది. కొడుకు పాత్రలో నటించిన విజయ్ కి మీనాక్షి చౌదరి జోడిగా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

ఇకపోతే ఈ సినిమాకు తమిళనాడు , ఓవర్సీస్ లలో మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో గొప్ప టాక్ రాలేదు. దానితో మిగతా ప్రాంతాల్లో ఈ సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు దక్కడం లేదు. కానీ తమిళనాడు , ఓవర్సీస్ లలో మాత్రం ఈ మూవీ కి భారీ స్థాయిలో కలెక్షన్లు దక్కుతున్నాయి. తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వెంకట్ ప్రబు మాట్లాడుతూ ... ఈ సినిమాలో మొదట స్నేహ పాత్రకు నయనతార ను అనుకున్నాం. కానీ ఆ తర్వాత స్నేహా ను సంప్రదించాం.

ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానితో నయనతార తో అనుకున్న పాత్రకు స్నేహా నీ తీసుకున్నామని వెంకట్ ప్రభు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే వెంకట్ ప్రభు కొంత కాలం క్రితం నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా కస్టడీ అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: