మన టాలీవుడ్ లో ఉన్నటువంటి సీనియర్ హీరోస్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మిస్టర్ బచ్చన్” థియేటర్స్ నుంచి ఇపుడు ఓటిటిలోకి కూడా వచ్చేసింది. మరి ఈ సినిమా తర్వాత ఊహించని విధంగా రవితేజకి చిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనితో అప్పుడు కొంచెం ఆందోళనకి లోనైన అభిమానుల కోసం రవితేజ స్వయంగా పోస్ట్  చేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా రవితేజ బయటకి కనిపించిన విజువల్స్ వైరల్ గా మారాయి. అయితే బాబీ ఇండస్ట్రీ లోకి వచ్చి 10 ఏళ్ళు అయ్యిన సందర్భంగా రవితేజ మీట్ అయ్యిన ‘పవర్’ఫుల్ ఫ్రేమ్ వైరల్ గా

 మారింది. మరి ఇందులో రవితేజ చేతికి కట్టు కనిపిస్తుండగా యాక్సిడెంట్ తర్వాత బయటకి వచ్చారు అంటే నెమ్మదిగా తాను కోలుకుంటున్నారని చెప్పాలి.  ఇకపోతే రవితేజ కి  ప్రస్తుతం వరుసగా ప్లాప్ లైతే వస్తున్నాయి. ఆయన కూడా మంచి క్యారెక్టర్ దొరికితే పెద్ద సినిమాల్లో విలన్ గా అయిన నటించడానికి సిద్ధంగా ఉన్నానని కొన్ని ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెప్పిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటికే ఆయన వరుసగా నాలుగు సినిమాలతో భారీ డిజాస్టర్ లను మూటగట్టుకున్నాడు. కాబట్టి రాబోయే సినిమాలతో కనక ఆయన విజయాన్ని అందుకోకపోతే మాత్రం ఇక ఆయన తప్పకుండా విలన్ గా మారే అవకాశాలైతే

 ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సినిమాల్లో ఇప్పటికే కొంతమంది దర్శకులు అతన్ని విలన్ గా సంప్రదించినప్పటికీ విలన్ కరెక్టరైజేషన్ బాగాలేదనే ఉద్దేశ్యంతోనే రవితేజ ఆ పాత్రలను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ పెద్ద హీరో సినిమాలో విలన్ పాత్ర వస్తే మాత్రం రవితేజ తప్పకుండా చేస్తాడంటూ పలు వార్తలైతే వస్తున్నాయి. ఇక నిజానికి ఆయన మాస్ మహారాజు గా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: