నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లోని 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాలీయ్య పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ సినిమా రిలీజైన తరువాత బాలయ్య తన నెక్స్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేయనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమా తరువాత నందమూరి బాలకృష్ణ  తనకు మంచి విజయాన్ని

 అందించిన ఓ యంగ్ డైరెక్టర్‌తో మరోసారి చేతులు కలపబోతున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.  ఇక నందమూరి బాలకృష్ణ  సినిమాలా విషయం కాసేపు పక్కన పెడితే బాలయ్య ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఒక బ్యాగ్ మాత్రం తన వెంట ఉంచుకుంటాడు. అయితే స్వయంగా ఆయన క్యారీ చేస్తాడు. ఆ బ్యాగ్ ఎందుకు అంత స్పెషల్.. అందులో ఏముంటుందని.. తెలుసుకోవాలని ఆశక్తి అభిమానులోనూ ఉంటుంది. అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ  బ్యాగ్‌లో ఎప్పుడు మెన్షన్ హౌస్ బాటిల్.. అలాగే ఒక హాట్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తూ ఉంటారట నందమూరి బాలకృష్ణ  . వేడి నీళ్లతో కలిపి మెన్షన్ హౌస్ తాగడం బాలకృష్ణకు అలవాటు.

 నందమూరి బాలకృష్ణ ఎక్కడికి వెళ్లినా హాట్ వాటర్, మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఆ బ్యాగ్ లోనే ఉంటుందని.. చివరకు విదేశాలకు వెళ్లాల్సిన నందమూరి బాలకృష్ణ ఆ బ్యాగులు మాత్రం మిస్ చేయడని ఓ సందర్భంలో స్వయాన చిన్నల్లుడు శ్రీ భరత్ వివరించారు. ఇంటర్వ్యూలో శ్రీ భారత్ మాట్లాడుతూ మావయ్య మాన్షన్ హౌస్ తాగుతాడని.. ఇది తెలిసిన తర్వాత కంపెనీ స్టాక్ విలువ కూడా పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: