ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే అనేక సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తూ ఉంటాయి. ఇక సంక్రాంతి తర్వాత ఆ స్థాయిలో సినిమాలు విడుదల అయ్యేది దసరా పండక్కి. దసరా పండక్కి కూడా సినిమాలు బాగానే విడుదల అవుతాయి. కానీ సంక్రాంతి పండుగకు విడుదల అయిన స్థాయిలో సినిమాలు విడుదల కావు. కానీ ఈ సారి దసరా పండక్కి కూడా భారీ ఎత్తున సినిమాలు విడుదల కాపడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలు కూడా వచ్చాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఈ సారి దసరా పండుగ సందర్భంగా గోపీచంద్ హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వం మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 11 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మించిన జనక అయితే గనక సినిమాని కూడా అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ప్రస్తుతం సుదీర్ బాబు "మా నాన్న సూపర్ హీరో" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. ఇక తమిళ నటుడు రజనీ కాంత్ ప్రస్తుతం వెట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కూడా అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇలా ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సినిమాలు పోటీ పడబోతున్నాయి. మరి ఇందులో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: