టాలీవుడ్ దేవర  రికార్డుల వేట అప్పుడే మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఇండియన్ ఆడియెన్స్‌తో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందే యూఎస్‌లో మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేసి తన సత్తా చాటింది. ఇప్పుడు ‘దేవర’ మరో అరుదైన ఫీట్ సాధించింది.లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న బియాండ్ ఫెస్ట్‌లో ‘దేవర’ స్పెషల్ షో వేయనున్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు జరిగే ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఇండియా నుంచి ఎంపికైన ఒకే ఒక్క చిత్రం ‘దేవర’. ఈ సినిమాను సెప్టెంబర్ 26న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శించనున్నారు. ఇక ఈ ఫెస్ట్‌కు

 ‘దేవర’ యూనిట్ హాజరుకానున్నట్లు సమాచారం. ఇక ఇందులో  సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే మరో వైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ తో రికార్డులు సృష్టించి తారక్, చరణ్ ఇప్పుడు సోలోగా రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.  నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందరికంటే వేగంగా అందుకోవడం ద్వారా దేవర మూవీ గేమ్ చేంజర్ కి ఒక టార్గెట్

 ఇచ్చింది. దీనిని చరణ్ గేమ్ చేంజర్ తో బ్రేక్ చేయగలడా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే గేమ్ చేంజర్ పై చెప్పుకోదగ్గ బజ్ లేదు. రిలీజ్ అయిన ఒక సాంగ్ కూడా పెద్దగా మెప్పించలేదు. వినాయకచవితికి పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. గేమ్ చేంజర్ ని టీజర్ రిలీజ్ చేసి మూవీ పైన బజ్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలా అయితేనే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. దానికి తగ్గట్లుగానే టికెట్ బుకింగ్స్ ఉంటాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: