2009లో విడుదలైన ‘‘లక్‌’’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది శృతి హాసన్ . ఆ తర్వాత తమిళంలో ఏజం బిడు, సింగం, త్రీ, పూజై చిత్రాల్లో నటించారు. సినిమాల్లో నటించడమే కాకుండా పాటలు పాడడం, కంపోజ్ చేయడం, రాయడం కూడా చేస్తుంటది శృతి హాసన్. అంతేకాకుండా గత నాలుగేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉంది. డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో ప్రేమాయణం సాగించడం మొదలుపెట్టింది. అతడితో కలిసి ఒకేచోట ఉంటూ ఈ అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తూనే ఉండేది. ఇందులో భాగంగానే తరచూ అతడితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ

 చేసింది. అలా శృతి అతడితో రెచ్చిపోతూ వార్తల్లో నిలిచేది.  శాంతను హజారికాతో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సుదీర్ఘ కాలంగా డేటింగ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అతడితో కలిసి యమ రొమాంటిక్‌గానూ గడిపింది. ఈ విషయం కమల్ హాసన్‌కు కూడా తెలుసు. ఇక, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శాంతనుకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది.  శాంతను కంటే ముందు ఇటాలియన్ నటుడు మైఖేల్ కోర్సలేతో కొన్నేళ్లు ప్రేమలో ఉన్నారు ఈ బ్యూటీ. రెండుసార్లు లవ్‌ బ్రేకప్ తర్వాత తత్వం బోధపడింది ఈ భామకు.

 ప్రస్తుతానికి తాను సింగిల్ అని.. ఇప్పట్లో నాట్ రెడీ టూ మింగిల్ అనేసారు. తన ఫోకస్ అంతా కెరీర్‌పైనే అంటున్నారు శృతి. కెరీర్‌లో ప్రస్తుతం జోరు మీదున్నారు శృతి. గతేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, హాయ్ నాన్న, సలార్‌లతో వరస హిట్స్ కొట్టారు. ఇక  ప్రస్తుతం రజినీకాంత్ కూలీలో నటిస్తున్నారు ఈ భామ. దాంతో పాటు అడివి శేష్ డెకాయిట్.. ప్రభాస్ సలార్ 2తో పాటు హాలీవుడ్ చెన్నై స్టోరీలోనూ నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: