కొన్ని సంవత్సరాల క్రితం రీమిక్ సినిమాల హవా జోరుగా కొనసాగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఏదైనా ఒక భాషలో మంచి సినిమా వచ్చింది అంటే చాలు వెంటనే దాన్ని రైట్స్ కొనుక్కోవడం , ఆ తర్వాత వెను వెంటనే ఒక హీరోను సెట్ చేసుకొని మూవీ ని రూపొందించడం జరుగుతూ ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. ఎప్పుడు అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో జోరు పెరిగిందో అప్పటి నుండి రీమిక్ సినిమాల హవా దాదాపుగా తగ్గిపోయింది. ఏదైనా మంచి సినిమా వచ్చింది అంటే చాలు అది దాదాపు నెల రోజుల్లోనే ఏదో ఒక ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తుంది.

దానితో ప్రపంచంలో ఎక్కడున్న ప్రేక్షకుడైన సినిమాలను చూసేస్తున్నాడు. దానితో రీమిక్ సినిమాల ట్రెండు భారీగా తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా కొంత మంది దర్శకులు రీమిక్ సినిమాలపై ఆసక్తిని తగ్గించుకోవడం లేదు. అలాంటి వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన వరుస పెట్టి రీమిక్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. తాజాగా హరీష్ శంకర్ , రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా హిందీ మూవీ అయినటువంటి రైడ్ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే హిందీ లో రైడ్ మూవీ సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ గా రెడ్ 2 మూవీ ని రూపొందించారు. మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమాని విడుదల కూడా చేయనున్నారు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయ్యి ఉంటే రైడ్ 2 కథతో మిస్టర్ బచ్చన్ 2 తీసే వారేమో కానీ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయ్యింది. కాబట్టి దాదాపు ఆ అవకాశాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: