టాలీవుడ్ యాక్టర్ రాజ్‌తరుణ్‌-లావణ్య  కేసు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించిన లావణ్య సమర్పించిన ఆధారాలతో.. ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించిన పోలీసులు రాజ్‌తరుణ్‌పై ఛార్జీషీట్‌ దాఖలు చేసి నిందితుడిగా చేర్చారు. మరోవైపు ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నాడు. రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో రెండు సార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్‌తో తనకుకు పదేళ్ల క్రితమే

 పెళ్లయిందని.. పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని పేర్కొన్న లావణ్య.. కొన్నాళ్ల క్రితం రాజ్‌తరుణ్‌ నాకు అబార్షన్‌ చేయించాడు. మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా పోలీసులకు అందించానని చెప్పింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. రాజ్ తరుణ్ తాజాగా భలే ఉన్నాడే అనే చేశాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు రాజ్ తరుణ్. ఈ సందర్భముగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్‌కు శేఖర్ భాషకు సంబందించిన ప్రశ్న ఎదురైంది. శేఖర్ బాషా నిజం కోసం నిలబడ్డాడు.. సరైన సమయంలో ఆధారాలతో వచ్చి నాకు చాలా సాయం చేశాడు అని రాజ్ తరుణ్ అన్నాడు. తనకోసం వీలైతే బిగ్ బాస్ కి

 వెళ్లి సపోర్ట్ చేస్తానని అన్నాడు రాజ్ తరుణ్. అలాగే శేఖర్ బాషాతో తనకు పెద్దగా పరిచయం లేదని , అంతకు ముందు కొన్ని ప్రమోషన్స్ లో మాత్రమే కలిసాను అంతే తప్ప తనకు అతనితో స్నేహం లేదు అని అన్నాడు. అయితే తన కోసం శేఖర్ బాషా చాలా చేశాడని. ఇప్పుడు శేఖర్ బాషా తనకి మంచి మిత్రుడిగా మారాడని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ కు సపోర్ట్ గా ఆర్జే శేఖర్ బాషా ముందుకు వచ్చాడు. లావణ్య పై అతడు ఆరోపణలు చేశాడు. అందుకే తనకోసం ఈ పని చేయటానికి రెడీ గా ఉన్నాడు రాజ్ తరుణ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: