కమెడియన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడు అనే సంగతి మనకు తెలిసిందే.మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించే చాలా సినిమాల్లో సునీల్ కి ప్రత్యేకమైన క్యారెక్టర్ ను రాసుకునేవారు.అలా బంతి, నీలాంబరి వంటి క్యారెక్టర్స్ ని స్పెషల్ గా  త్రివిక్రమ్ సునీల్ కోసమే రాసుకున్నారు. ఇక సునీల్ ఇండస్ట్రీకి వచ్చినా కొత్తలో కమెడియన్ గా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా..ప్రస్తుతం విలన్ గా కూడా నటిస్తున్నారు. ఈయన స్టార్ హీరోలకు సైతం విలన్ గా నటిస్తున్నారు. అలా రజినీకాంత్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకి విలన్ గా నటించి కేవలం కమెడియన్,హీరో మాత్రమే కాదు విలన్ గా కూడా మెప్పించగలను అని సునీల్ రుజువు చేసుకున్నారు. 

అయితే అలాంటి సునీల్ ఓ స్టార్ యాంకర్ తో గతంలో ఎఫైర్ పెట్టుకున్నారని ఓ వార్త ఫిలింనగర్లో ఎక్కువగా వినిపించింది.. ఇక ఆమె యాంకర్ మాత్రమే కాదు చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి,అక్క, అత్త, వదిన,పిన్ని పాత్రల్లో నటించింది. అయితే సునీల్ తో కలిసి ఆ యాంకర్ ఒక సినిమాలో భార్యగా నటించింది.ఇక ఆమె ఎవరో కాదు యాంకర్ ఝాన్సీ.. సునీల్ ఝాన్సీ ఇద్దరు కలిసి పెళ్లయిన కొత్తలో సినిమాలో భార్య భర్తలుగా నటించారు.
 

అయితే ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడు వీరిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ ఒక రూమర్ ఇండస్ట్రీలో వైరల్ చేశారు. అయితే చెప్పుకోవడానికి వీరి మధ్య ఏమీ లేదు.కానీ కావాలనే కొంతమంది ఈ గాసిప్ ని వైరల్ చేశారు.ఇక వీరి కాంబినేషన్లో కొన్ని సినిమాలు వచ్చాయి.దాంతో ఇద్దరి మధ్య ఈ రూమర్ వార్తలు ఎక్కువైపోయాయి. కానీ నిజానికి ఝాన్సీ, సునీల్ మధ్య ఎలాంటి తప్పుడు రిలేషన్ లేదు. కేవలం గాసిప్ రాయుళ్ళు క్రియేట్ చేసిన గాలి రూమర్ మాత్రమే అది.

మరింత సమాచారం తెలుసుకోండి: