దిల్ రాజు బ్యానర్లో ప్రభాస్ మొదటగా మున్నా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్లో ప్రభాస్ "మిస్టర్ ఫర్ఫెక్ట్" సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కంటే ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు. దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... దశరథ్ నాకు మిస్టర్ ఫర్ఫెక్ట్ స్టోరీని కాస్త వినిపించాడు. అది నాకు బాగా నచ్చింది. వెంటనే నేను ప్రభాస్ కి ఫోన్ చేశాను.

ఇలా ఒక ఫ్యామిలీ స్టోరీ ఉంది ... వింటావా అని అన్నాను. ఒకే సార్ వింటాను అన్నాడు. దానితో ఫోన్ లోనే ప్రభాస్ , ప్రభాస్ కి కథను చెప్పించాను. కథ మొత్తం విన్న ప్రభాస్ ఫస్ట్ అఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంతా గొప్పగా లేదు అని అన్నాడు. దానితో కొంత టైమ్ ఇవ్వు నీకు మళ్ళీ కథను వినిపిస్తాను అని చెప్పాను. ఇక ప్రభాస్ కి కొంత కాలం తర్వాత సెకండాఫ్ పూర్తి అయ్యాక ఫోన్ చేసి కథ మొత్తం పూర్తి అయ్యింది. వింటావా అన్నాను. ఇక ప్రభాస్ వింటాను అన్నాడు. ప్రభాస్ వచ్చాడు ... సెకండ్ హాఫ్ కూడా విన్నాడు. సూపర్ గా ఉంది సార్ చేస్తాను అన్నాడు.

ఇక తర్వాత ఏం జరిగింది అంటే ... ప్రభాస్ నా దగ్గరకు వచ్చి నాకు మొదట ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఫస్టాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ ఏ మాత్రం నచ్చలేదు. దానితో నేను మీరు ఫోన్ చేశాక కథ వినకుంటే బాగోదు అని వింటాను అని చెప్పాను. కానీ విన్న తర్వాత ఈ సినిమాను రిజెక్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మ్యాజిక్ చేశారు. సెకండ్ ఆఫ్ చాలా చేంజెస్ చేశారు. అందుకే నేను ఈ మూవీ ని ఓకే చేశాను అని ప్రభాస్ అన్నాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: