నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన నాని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు. నాని హీరోగా రష్మిక మందన హీరోయిన్గా దేవదాస్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ఆ తర్వాత నాని హీరోగా రూపొందిన ఓ రెండు సినిమాలకు హీరోయిన్గా రష్మిక మందన ను సంప్రదించగా ... ఆమె మాత్రం ఆ సినిమాల్లో నటించెను అని చెప్పిందట. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా గౌతమ్ టిన్ననురి దర్శకత్వంలో జెర్సీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్గా మొదట రష్మిక మందన ను అనుకున్నారట. అందులో భాగంగా ఈ సినిమా కథను కూడా వివరించారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈమె ఆ సినిమా చేయలేను అని చెప్పిందట. ఇక నాని కొంత కాలం క్రితం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నజ్రియా హీరోయిన్గా నటించింది.

ఈ సినిమాలో హీరోయిన్గా మొదట రష్మిక మందన ను అనుకున్నారట. అందులో భాగంగా ఈమెను సంప్రదించి కథను కూడా వివరించగా ఈ ముద్దుగుమ్మ ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. అలా నాని హీరోగా రూపొందిన రెండు సినిమాలలో ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ గా అనుకోగా ఈమె మాత్రం రెండు సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: