ఏంటి శృతిహాసన్ మళ్లీ ప్రేమలో పడిపోయిందా..ఈ మధ్యనే కదా బ్రేకప్ అయింది.. మళ్ళీ ప్రేమలో పడడం ఏంటి.. ఇంత తక్కువ గ్యాప్ మళ్లీ ప్రేమలో పడిపోతారా.. ఇదెక్కడి విడ్డూరం అని ఈ విషయం తెలిసిన చాలామంది అనుకుంటారు. అయితే ప్రేమలో పడడానికి సమయం సందర్భం అంటూ ఏమీ ఉండదు. చూపులు కలిసిన శుభవేళ అంటూ తొలిచూపులోనే ప్రేమలో పడిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు.ఇక సినీ ఇండస్ట్రీలో అయితే మరీ కామన్.. ఇష్టారీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. కళ్ళకు నచ్చిన ఏదైనా సరే వాళ్ళు కావాలి అనుకుంటారు. ఎందుకంటే సెలబ్రెటీ లైఫ్ కదా.. కోట్లకు కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా చాలా సిల్లిగా తీసుకుంటూ ఉంటారు.. అయితే అలాంటి శృతిహాసన్ ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు  పర్సనల్ విషయాల ద్వారా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే శాంతాను హాజరికకు బ్రేకప్ చెప్పింది.గత కొద్ది సంవత్సరాలుగా శాంతాను హాజరికతో లివింగ్ రిలేషన్ లో ఉండి ఒకే ఇంట్లో ఓకే బెడ్ పై ఉంటూ ఒకే కంచంలో తింటూ అన్నట్లుగా ఉన్న ఈ జంట రీసెంట్ గా బ్రేకప్ చెప్పుకున్నారు.అయితే వీరి బ్రేకప్ వార్తలు సర్దుమనగక ముందే మళ్ళీ శృతిహాసన్ ప్రేమలో పడిపోయినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. శృతిహాసన్ ఈ మధ్యనే ఓ హీరోతో ప్రేమలో పడిపోయినట్లు తెలుస్తోంది.అయితే ఆ హీరోతో ప్రస్తుతం పార్టీలు,పబ్బులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తుందట.

అయితే కొంతమందేమో ఆ హీరోతో అలా చనువుగా ఉంటుంది. తప్ప అందులో రిలేషన్ వంటివి ఏమీ లేదు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని అంటూ ఉంటే.. మరి కొంతమందేమో  లేదు లేదు శృతిహాసన్ మళ్ళీ ప్రేమలో పడిపోయింది అంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.మరి శృతిహాసన్ ప్రేమలో పడిపోయిందా..లేక ఫ్రెండ్ లాగే ఆ హీరోతో తిరుగుతుందా అనేది చూడాలి. ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అడివి శేష్ తో డెకాయిట్ మూవీ తో పాటు రజినీకాంత్ హీరోగా చేస్తున్న కూలి మూవీలో రజిని కాంత్ కి కూతురు పాత్రలో నటిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: