ఇంకేముంది స్టార్ హీరోల భవిష్యత్తు ఏంటి అన్న విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయాడు. అయితే ఆయన చెప్పిన విషయాలు ఎన్నో జరగడం తో చాలా మంది వేణు స్వామిని నమ్మడం కూడా మొదలు పెట్టారు అన్న విషయం తెలిసిందే. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటారని చెప్పింది కూడా ఈ జ్యోతిష్యుడే కావడం గమనార్హం. ఇక ప్రభాస్ కి వరుస ఫ్లాపులు వస్తాయి అన్న విషయాన్ని కూడా చెప్పాడు. కానీ ఆ తర్వాత హిట్స్ రావడం తో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అయితే కొంతకాలం నుంచి వేణు స్వామి ఒక వివాదంలో ఇరుక్కున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఏకంగా జర్నలిస్టు మూర్తితో వేణు స్వామి వివాదం సోషల్ మీడియాలో సంచలనం గా మారింది. అయితే ఇక ఈ వివాదం లో ప్రస్తుతం కీలక పరిణామం చోటు చేసుకుంది అన్నది తెలుస్తుంది. వేణు స్వామి పై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రజలను జాతకాల పేరుతో ఆయన మోసం చేస్తున్నారని.. అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోని కూడా ఆయన మార్ఫింగ్ చేశారు అంటూ జర్నలిస్టు మూర్తి నాంపల్లి కోర్టు లో పిల్ దాఖలు చేయగా.. దీనిపై విసరణ జరిపిన కోర్టు వేణు స్వామి పై కేసు నమోదు చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.