టాలీవుడ్ కోలీవుడ్లో నటి కస్తూరి గురించి చెప్పాల్సిన పనిలేదు.. అన్ని భాషలలో నటించి దక్షిణాది నటిగా పేరు సంపాదించింది. ఇమే చదువుకునే రోజులలోనే మోడలింగ్ వైపుగా అడుగులు వేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా పలు చిత్రాలలో నటించిన కస్తూరి గత ఏడాది తమిళరసన్, రామర్పరంపరై వంటి చిత్రాలలో కూడా నటించింది ఈ ఏడాది సింబా అనే చిత్రంలో కనిపించింది కస్తూరి. తెలుగులో కూడా ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈమె మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నది.


గత కొన్ని రోజులుగా కేరళ సిని పరిశ్రమలో సంచలనంగా మారిన హేమ కమిటీ నివేదిక పైన కస్తూరి మాట్లాడుతూ.. హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత చాలామంది నటిమనులు సైతం తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు ఇబ్బందుల గురించి బయట పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే కస్తూరి కూడ మాట్లాడుతూ తను నటిస్తున్న రెండవ సినిమాలోని దర్శకుడు తనని కమిట్మెంట్ అడిగారని చెప్పి ఒక సంచలనంగా మారింది. అంతేకాకుండా డైరెక్టర్ అనుచితంగా మాట్లాడారని అడ్జస్ట్ చేసుకోమని అడిగారని తెలిపింది కస్తూరి.


సినిమా షూటింగ్స్ స్పాట్  లోనే అందరి ముందు ఆ డైరెక్టర్ ని తిట్టేసానని.. అందుకే తనని కొంతమేరకు సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆ సినిమా నుంచి తప్పించారని తెలిపింది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటించేందుకు చాలామంది కమిట్మెంట్ అడుగుతూ ఉంటారు.. కేవలం ఆ పాత్రకు నటి సెట్ అవుతుందా లేదా అనేది చూడరు కేవలం ఆమె శరీరం ఎలా ఉంది అనే విధంగానే ఆడిషన్స్ లో చూస్తూ ఉంటారని తెలిపింది కస్తూరి.అంతేకాకుండా తను సినిమాలో నటిస్తున్నప్పుడు ఆడిషన్ కి వెళ్ళగా తనని ఓకే చేసిన తర్వాత కమిట్మెంట్ కి ఒప్పుకోలేదని సన్నగా ఉన్నానని తప్పించారని తెలిపింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు.కస్తూరి తల్లి  న్యాయవాది కావడం చేత చాలామంది తనను ఇబ్బందులు పెట్టిన వారందరూ కూడా సైలెంట్ అయ్యారని తెలిపింది... అందుకే ఇండస్ట్రీలోకి రావాలనుకునే అమ్మాయిలు చాలా ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: