ఈ మధ్యకాలంలో హాలీవుడ్, బాలీవుడ్ ,టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రేక్షకులు ఎక్కువగా హారర్ చిత్రాలు చూడడానికి మక్కువ చూపుతున్నారు. అందుకే స్టార్ హీరోలు కూడ హర్రర్ సినిమాలలో నటించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. గతంలో వర్మ ఎన్నో చిత్రాలను కూడా తెరకెక్కించారు. బాలీవుడ్ లో కూడా ఎన్నో హర్రర్ చిత్రాలు వచ్చాయి. చంద్రముఖి, కాంచన, ముని ఇలా ఎన్నో హర్రర్ చిత్రాలు కూడా ప్రేక్షకులను భయపెట్టాయి. అయితే ఈ చిత్రాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు హాలీవుడ్ మూవీ ది ఎక్సార్సిస్ట్ సినిమా 50 ఏళ్ల క్రితమే వచ్చింది.


ది ఎక్సార్సిస్ట్ సినిమా 50 ఏళ్ల క్రితమే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రంగా పేరు సంపాదించింది చాలా దేశాలు ఈ చిత్రంలోని హర్రర్ ఎలివేన్స్ చాలా ఉన్నాయని బ్యాన్ చేశారట.. బ్రిటన్ వంటి దేశాలలో కూడ ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారంటే ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.. 1973లో కేవలం 23 థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఎంతోమంది నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా చాలా విచిత్రంగా ప్రవర్తించే వారట. థియేటర్లో చాలామంది వాంతులు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. కొంతమంది థియేటర్ తలుపులు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్లిపోవడమే కాకుండా బయటికి వచ్చిన తర్వాత పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవారట.



అయితే ఇప్పుడు కొత్తగా అమెజాన్ ప్రైమ్ 4k క్వాలిటీతో అందుబాటులో ఉన్నది. గతంలో పోలిస్తే ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ మరింత అద్భుతంగా ఉన్నది. అయితే అమెజాన్ రెంట్ పద్ధతిలో ఈ సినిమా  అందుబాటులో ఉన్నదట. ఈ సినిమా చూసే ధైర్యం దమ్ము ఉన్నవారు మాత్రమే చూడాలి ఏమాత్రం గుండె సమస్యలు ఉన్నవారు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయట. అంత భయంకరంగా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: