స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువ.ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో అటు సినిమా విశ్లేషకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా సూర్య ఇందులో ఆరు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడన్న టాక్ ఉండనే ఉంది. అదీకాక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ఫైర్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.దాంతో సినిమాపై భారీ హైప్ వచ్చింది.ఇప్పటి వరకు సినిమా చరిత్రలో రాని ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక రెండు నెలల ముందే ట్రైలర్ ను రిలీజ్ చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం కాక.. అందరిని షాక్ కు గురిచేశారు.

'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దిశా పటానీ, సూర్యకు పవర్‌ఫుల్ విలన్‌గా యానిమల్ విలన్ బాబీ డియోల్ నటిస్తున్నారు.'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా 'కంగువ' సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమాల్లో ప్రధాన పాత్రలతోపాటు తమిళ కమెడియన్ యోగి బాబు కూడా నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమా గురించి ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైర్లు అవుతాను.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ విజువల్స్ తో కూడిన సినిమా 'కంగువ' వాయిదా పడింది. ఈ చిత్రానికి అసలు విడుదల తేదీ అక్టోబర్ 10.అయితే, రజనీకాంత్ 'వెట్టయన్' ఆ తేదీని లాక్ చేయడంతో 'కంగువ'టీమ్ మరో తేదీని ఎంచుకోవలసి వచ్చింది. అనేక సమీకరణాలను బట్టి లెక్కలు వేసుకున్న తర్వాత సినిమాని నవంబర్ 14వ తేదీన రిలీజ్ చేసినందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొదట్లో, నిర్మాతలు'పుష్ప 2'వాయిదా గురించి ఊహాగానాల కారణంగా డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయొచ్చు అనుకున్నారు.అయితే కచ్చితంగా పుష్ప డిసెంబర్ 6న రావడం ఖాయమని మేకర్స్ తేల్చి చెప్పడంతో నవంబర్ 14వ తేదీని కొత్త తేదీగా ఎంచుకున్నారు. నిజానికి 'కంగువ' వంటి భారీ బడ్జెట్ చిత్రానికి ఇది సరైన తేదీ కాదు.ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో భారతదేశం అంతటా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఈ సినిమాకి హిందీ మార్కెట్ కీలకం కానుంది.కంగువ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: