ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఎవరిని కదిలించినా కానీ దేవర హైప్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఫ్యాన్స్ అంతా ఈ సినిమా పక్కా హిట్ కొట్టేస్తుందనే ఊపులోనే ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా దేవర కు అనుకూలంగానే ఉన్నాయి.ఆ సమయంలో వేరే ఏ సినిమాలు పోటీ లేకపోవడంతో కచ్చితంగా థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించడం ఖాయం.ఇక ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేదు. దాదాపు ఇప్పటికే మూవీ నుంచి రావాల్సిన అప్ డేట్స్ అన్ని కూడా వచ్చేశాయి.ఆ ఒక్కటీ తప్ప. అదే ఆయుధ పూజ సాంగ్.ఈ సాంగ్ మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు.ప్రస్తుతం టాలీవుడ్‌లో ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ మేనియా కొనసాగుతోంది.ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు అలెర్ట్ అవుతున్నారు.ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ మాసివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అటు సాంగ్స్ కూడా ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.అయితే ఈ సినిమాలో ‘ఆయుధ పూజ’ సాంగ్ ఉంటుందని అది సినిమాకే హైలైట్ కాబోతుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తున్నారు.

ఇప్పుడు ఈ పాటకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి.దేవర వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కి రెండు వారాల సమయం ఉంది. అయితే, వచ్చే వారంలో ‘ఆయుధ పూజ’ సాంగ్ రానుందని ఇది పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాస్ట్ అవుతుందని ఆయన తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.దీంతో ‘ఆయుధ పూజ’ ట్రాక్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.దేవర నుంచి నెక్స్ట్ 'ఆయుధ పూజ' సాంగ్  రాబోతుందని, ఇది ఓ రేంజ్ లో ఉంటుందని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అంటున్నారు. "ఆనందం అప్పుడే అయిపోలేదయ్యా ఇప్పుడే మొదలు ఆయుధపూజ పాట వస్తే ఇంక పట్టలేం మిమ్మల్ని.." అంటూ దేవర ట్రైలర్ విడుదలైనప్పుడు ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసిన రామజోగయ్య శాస్త్రి తాజాగా మరో పోస్ట్ చేశారు. 'ఆయుధ పూజ ట్రాక్ తో నెక్స్ట్ వీక్ బిగ్గెస్ట్ బాంబ్ బ్లాస్ట్' అంటూ రామజోగయ్య శాస్త్రి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కి దేవర అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి 'పోతారు' అని రిప్లైరావడం విశేషం.

దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు వారం ముందు అనగా సెప్టెంబర్ 20న 'ఆయుధ పూజ' సాంగ్ రిలీజ్ చేయనున్నారని సమాచారం.ఇప్పటికి దేవర మూవీ నుంచి మూడు పాటలు రిలీజ్ చేసారు మేకర్స్.ఈ మూడు పాటలు కూడా మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఆ తర్వాత ఈ మూవీ నుంచి రాబోయే పాట ఆయుధ పూజ సాంగ్. ఆల్రెడీ ఈ సాంగ్ మీద భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సాంగ్ సినిమా మొత్తానికే హైలెట్ కాబోతుందని మూవీ టీమ్ చెప్తూ వస్తున్నారు.ఇక ఈ సినిమాకు అనిరుద్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.మరి ఈ సాంగ్ కరెక్ట్ గా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఆల్రెడీ దేవర సినిమాపై విపరీతమైన బజ్ ఉండడంతో మూవీకి సంబంధించి ఎప్పుడు ఏ అప్ డేట్ వచ్చినా కానీ అభిమానులు వెంటనే ఎలెర్ట్ అవుతున్నారు.సోషల్ మీడియాలో మూవీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.రిలీజ్ కు ముందే దేవర సగం హిట్ అయిందని చెప్పి తీరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: