సినీ ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే 30, 40 ఏళ్లు వచ్చినా కూడా హీరోలుగా కొనసాగిస్తూ ఉంటారు. అయితే హీరోయిన్స్ మాత్రం అలా కాదు మహా అంటే 5 లేదా 10 ఏళ్ళు హీరోయిన్గా కొనసాగించడం గొప్పగా మారిపోయింది. కొంతమంది హీరోయిన్స్ మాత్రమే పదేళ్లకు మించి ఇండస్ట్రీలో కొనసాగించిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం దాదాపుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్ళు అవుతున్నా వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. ఆమె ఎవరో కాదు మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన మంజు వారియర్.


ఈమె తమిళం తో పాటు హిందీ చిత్రాలలో కూడ నటించింది. ఒకానొక సమయంలో మంజు వారియర్ సౌత్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈమధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తోంది. ధనుష్ తో కలిసి ఒక సినిమాలో ఇటీవలే నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ వయసులో కూడ హీరోయిన్గా రాణిస్తూ ఉండడంతో మంజు వారియర్ కి కూడ భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల రజనీకాంత్ నటించిన వెట్టయన్ సినిమాలోని ఒక పాట రిలీజ్ అయింది. ఇందులో కూడ ఈమె నటిస్తున్నట్లు తెలుస్తోంది.


డైరెక్టర్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే విడుదల చేసిన పాటలో కూడా మంజు వారియర్ స్టెప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అదే గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ 46 ఏళ్ల వయసులో కూడా అదే ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈమె డాన్స్ మూమెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోకి 15 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టిందట. దాదాపుగా మలయాళం లో 40 సినిమాలకు పైగా నటించిన మంజువారియర్ తమిళంలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. 1995లో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టింది.. హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న సమయంలో 1999లో హీరో దిలీప్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి విడిపోయారట. వీరికి ఒక పాప కూడా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: