టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ తన కెరియర్లో మాస్ మహారాజా రవితేజతో ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కించగా , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ ని ఇప్పటికే రూపొందించాడు. మరో మూవీ ని రూపొందిస్తున్నాడు. రవితేజ తో హరీశ్ శంకర్ రూపొందించిన మొదటి సినిమా షాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రెండవ సినిమా మిరపకాయ్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక మూడవ సినిమాగా కొన్ని రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ మొదటగా గబ్బర్ సింగ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఈ దర్శకుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం హరీష్ శంకర్ తన సినిమాల టైటిల్స్ విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ ... మిరపకాయ్ సినిమాకి నేను రొమాంటిక్ రిషి అనే టైటిల్ అనుకున్నాను. ఆల్మోస్ట్ అది కన్ఫామ్ చేద్దాం అనుకున్నాను. చివరి నిమిషంలో దానిని రవితేజ కు చెప్పాను. దానితో రవితేజ దానికంటే మిరపకాయ్ బాగుంటుందేమో ఆలోచించండి అన్నారు.

నాకు కూడా రొమాంటిక్ రిషి కంటే మిరపకాయ్ టైటిల్ బాగా నచ్చింది. దానితో వెంటనే దాన్ని ఓకే చేశాను. ఇక గబ్బర్ సింగ్ సినిమాకి కూడా ఆ టైటిల్ ను పవన్ కళ్యాణ్ సూచించారు. నాకు ఆ టైటిల్ బాగా నచ్చడంతో వెంటనే దానిని ఓకే చేశాను అన్నారు. ఇక రవితేజ , పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సినిమాల గురించి బాగా పట్టించుకుంటారు. సినిమా విజయం సాధించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: